రూ.11 కోట్లు: వైసీపీకి కంగారే కంగారు!
హైదరాబాద్ లో లిక్కర్ స్కాం సొమ్ము రూ.11 కోట్లు దొరకిన వ్యవహారం సంచలనం సృష్టిస్తూంటే.. ఆ సొమ్ముతో జగన్ కు లిక్కర్ స్కాంకు సంబంధం లేదన్న వాదనలను నిందితుల నుంచి వైసీపీ పార్టీ నుంచి వినిపించడం ప్రారంభించారు. శంషాబాద్ శివారులోని ఫాంహౌస్ లో దొరికిన నగదుతో తనకు సంబంధం లేదని కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన లాయర్ తో అప్పటికప్పుడు ఏసీబీ కోర్టులో అఫిడవిట దాఖలు చేశారు. ఆయన జైల్లో ఉన్నారు. ఆయన తరపు లాయర్ దాఖలు చేశారు. ఇలా అఫిడవిట్ వేసినట్లుగా ఆయనకు లాయర్ తర్వాత చెబుతాడేమో కానీ ఆయన పేరు మీద అఫిడవిట్ పడిపోయింది.
అంతకు ముందే నిన్నటిదాకా కనిపించకుండా పోయిన పేర్ని నాని తెరపైకి వచ్చారు. మీడియా సమావేశం పెట్టి.. ఎక్కడ డబ్బులు దొరికినా లిక్కర్ స్కాం అంటున్నారని.. ఆ డబ్బులతో లిక్కర్ స్కాంకు సంబందం ఏమిటని ప్రశ్నించారు. ఆ ఫాం హౌస్ యజమానికి చాలా వ్యాపారాలున్నాయని అంటున్నారు. ఆయనకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా.. లిక్కర్ కేసులో నిందితుడు అయిన వరుణ్ పురుషోత్తం అక్కడ డబ్బులు దాచామని సమాచారం ఇవ్వడంతోనే అరెస్టు చేశారు. లిక్కర్ సొమ్ము కాకకపోతే వరుణ్‌కు ఎలా తెలుస్తాయి ?
చావు తెలివితేటలు చూపించి..లిక్కర్ స్కాం చేశారు. ఇప్పుడు అవే తెలివితేటలు చూపించి అడ్డగోలు వాదనలు చేసి.. మాకు సంబంధం లేదని వాదిస్తున్నారు. కానీ అడ్డంగా దొరికిపోయిన తర్వాత .. ఇలాంటి కథలు చెబితే ప్రజలు కూడా నవ్వుకుంటారని అనుకోవడం లేదు. లిక్కర్ స్కాంలో ఇంకా గుప్త నిధులుచాలా ఉన్నాయి. వాటిని బయట పెట్టాల్సి ఉంది. బంగారం ఖజానాను ఎక్కడికి తరలించారో కూడా సిట్ వెతికి పట్టుకోవాల్సి ఉంది