హిందూ వాహిని బంద్‌కు మద్దతుగా కంబ్లే సాహెబ్ రావు పిలుపు

హిందూ వాహిని భైంసా బంద్, కంబ్లే సాహెబ్ రావు
  • భైంసా బంద్‌కు హిందూ వాహిని పిలుపు
  • నాగదేవత ఆలయం ఘటనపై నిరసన
  • యువ నాయకుడు కంబ్లే సాహెబ్ రావు మద్దతు

భైంసా మండలంలోని నాగదేవత ఆలయం ఘటన నేపథ్యంలో హిందూ వాహిని పిలుపు మేరకు భైంసా బంద్ ప్రకటన జరిగింది. మాజీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, ముధోల్ అధ్యక్షుడు కంబ్లే సాహెబ్ రావు హిందూ వాహిని పోరాటానికి మద్దతు ప్రకటించారు. బంద్‌లో అందరూ సహకరించాలని కోరుతూ జయ్ భీమ్, జయ్ శ్రీరామ్ నినాదాలను ప్రస్తావించారు.

భైంసా మండలంలోని నాగదేవత ఆలయం ఘటనపై హిందూ వాహిని తీవ్రంగా స్పందించింది. ఆలయం పట్ల జరిగిన దాటికి నిరసనగా హిందూ వాహిని భైంసా బంద్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి మద్ధతుగా మాజీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, ముధోల్ అధ్యక్షుడు కంబ్లే సాహెబ్ రావు తన మద్దతు ప్రకటించారు.

కంబ్లే సాహెబ్ రావు మాట్లాడుతూ, “మా సైనిక బృందం మరియు మిత్రులందరూ భైంసా బంద్‌ను విజయవంతం చేయడంలో సహకరించాలని కోరుతున్నాను. ఆలయ గౌరవాన్ని కాపాడటంలో నిరసనలు మా సమాజానికి అవసరం. జయ్ భీమ్, జయ్ శ్రీరామ్” అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా హిందూ వాహిని కార్యకర్తలు బంద్‌ను విజయవంతం చేయడానికి పిలుపునిచ్చారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment