కామారెడ్డి బీసీ ఆక్రోష సభ పిలుపు – జిల్లా వ్యాప్తంగా ప్రచారం
బాల్కొండ, నవంబర్ 13 (మనోరంజని తెలుగు టైమ్స్):
ఈనెల 15వ తేదీన జరగనున్న బీసీ ఆక్రోష సభకు విస్తృతంగా ప్రజలను ఆహ్వానిస్తూ, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ రామా గౌడ్, ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మహారాజు జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటిస్తున్నారు. గత ఐదు రోజులుగా జిల్లాలోని అన్ని మండలాలను సందర్శిస్తూ, బీసీ–ఎస్సీ–ఎస్టీ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతూ సభ విజయవంతం కోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రోజున కమ్మర్పల్లి మండలం రాజరాజేశ్వరనగర్ (నల్లూర్)గ్రామంలో మండల జేఏసీ నాయకులతో కలిసి నల్లూరు గ్రామ ఎస్సీ సంఘ నాయకులను కలిసి, శనివారం జరగబోయే బీసీ ఆక్రోష సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ కన్వీనర్ రామా గౌడ్ మాట్లాడుతూ, “ఈనెల 15న కామారెడ్డిలో జరగబోయే బీసీ ఆక్రోష సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నాయకులు గుర్రం నరేష్, మెరుగు నాగేశ్వర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.