రాజ్యసభ ఎంపీగా కమల్ ప్రమాణస్వీకారం
మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా తమిళంలో ప్రమాణస్వీకారం చేశారు. డీఎంకే కూటమి మద్దతుతో ఎన్నికైన ఆయన, ఈ అవకాశాన్ని భారతీయుడిగా గౌరవంగా భావిస్తూ, తన బాధ్యతను నిర్వర్తిస్తానని అన్నారు. కమల్‌తో పాటు పి.విల్సన్, సల్మా, శివలింగంతో పాటు మరికొంత మంది ప్రమాణస్వీకారం చేశారు