…..
కల్వకుంట్ల కవిత మరో సంచలనానికి తెర తీశారు..!
తన కుమారుడిని రాజకీయ ప్రవేశం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
ఇందులో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ లో నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల నిరసనకు కుమారుడు ఆదిత్యను కూడా తీసుకువచ్చారు.
జాగృతి నేతలతో కలిసి ఆదిత్య ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసనలో చురుకుగా పాల్గొన్నారు..
పెద్దగా సంకోచం మొహమాటం లేకుండా అందరితో కలిసిపోయిన ఆదిత్య నిరసనలో పాలు పంచుకున్నాడు..!
మొత్తం మీద తండ్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తండ్రి స్థాపించిన గులాబీ పార్టీ నుండి బయటకు వచ్చిన కవిత తన జాగృతి సంస్థ ద్వారా రాజకీయాలు కొనసాగిస్తున్నారు.. తాజాగా ఆమె తన ఇరవై ఏళ్ల కుమారుడిని కూడా రాజకీయాల్లోకి దింపుతున్న పరిణామాలను బట్టి చూస్తే సొంతంగా పార్టీని స్థాపించడం వైపు మొగ్గు చూపుతున్నట్లు భావించాలి..!
….