విద్యా భారతి పాఠశాలలో ఘనంగా కలాం జయంతి వేడుకలు

విద్యా భారతి పాఠశాలలో ఘనంగా కలాం జయంతి వేడుకలు

మనోరంజని తెలుగు టైమ్స్ కుబీర్ ప్రతినిధి అక్టోబర్ 15

నిర్మల్ జిల్లా కుబీర్ మండల పరిధిలోని పల్సి గ్రామంలో విద్యా భారతి పాఠశాలలో బుధవారం ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

పాఠశాల డైరెక్టర్ పురంశెట్టి లింగయ్య మాట్లాడుతూ, “కలాం గారు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, పేపర్ బాయ్‌గా ప్రారంభించి దేశ అత్యున్నత పదవిని అధిరోహించారు. ఆయన కృషి, క్రమశిక్షణ, దేశాభివృద్ధిపట్ల నిబద్ధత ప్రతి విద్యార్థికి స్ఫూర్తి కావాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పోతన్న, కరస్పాండెంట్ గంగా సింగ్, ఉపాధ్యాయులు కొట్టే ప్రవీణ్, రాజు, సాయినాథ్, భోజన్న, దేవకి, కవిత, సరోజన, రాణి, గంగామణి, సరస్వతి, నేహా, నందిని, శ్రీవిద్య, అంజలి, శృతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment