పోలీసుల ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శన
తానూర్ మనోరంజని ప్రతినిధి నవంబర్ 08
మండల కేంద్రమైన తానూరులో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై హన్మండ్లు ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శన నిర్వహించారు, మెజీషీయన్ సుధకర్ కళాజాత ప్రదర్శనల ద్వారా ప్రజలకు మూఢనమ్మకాలు, సీసీ కెమెరాల ఆవశక్యత, హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, మత్తు పదార్థాలను సేవించడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం యువత ఆన్లైన్ గేమ్ మోజులో పడి నష్టపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తాడేవార్ విట్టల్, జాదవ్ మాధవరావు పటేల్, సోసైటీ డైరెక్టర్ హెచ్. పుండలిక్, నాయకులు శివాజీ పటేల్, పోశేట్టి, గణేష్, పింటూ మహారాజ్, గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.