కడెంలో ప్రైవేట్ క్లినిక్ సీజ్
మనోరంజని తెలుగు టైమ్స్ – ఖానాపూర్ ప్రతినిధి, నవంబర్ 13:
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ క్లినిక్‌పై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–2010 నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేందర్ ఆ క్లినిక్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆర్ఎంపీ వైద్యులు యాంటీబయోటిక్స్, ఇంజక్షన్లు, సెలైన్ బాటిల్స్ వాడకూడదు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా విస్తరణ మరియు మీడియా అధికారి బారె రవీందర్, డిపిఓ రామచందర్ తదితరులు పాల్గొన్నారు.