సదాశివపేట్లో జ్యోతిరావు ఫూలే వర్ధంతి వేడుక
మనోరంజని తెలుగు టైమ్స్ సదాశివపేట్, డిసెంబర్ 28
సదాశివపేట్ బస్టాండ్ వద్ద జ్యోతిరావు ఫూలే వార్ధంతి సందర్భంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు జావేద్, పట్టణ అధ్యక్షుడు అంతయ్య నహీ, మండల అధ్యక్షుడు రాములు యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్, పట్టణ ఉపాధ్యక్షుడు పరిగి శ్రీను, జాయింట్ సెక్రటరీ జెన్షెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జావేద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మహేందర్, కిష్టయ్య, దోడ్ల వెంకట్ తదితరులు ఫూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.
“సమానత్వం, విద్యా హక్కు, సామాజిక న్యాయం కోసం ఫూలే చేసిన పోరాటం యుగయుగాల పాటు నిలిచే మార్గదర్శకం. యువత ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలి” అని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.