M4News (ప్రతినిధి)
నిజామాబాద్, అక్టోబర్ 11, 2024
జిల్లా అధ్యక్షుడు గైని సాయి మోహన్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న టీమ్ కుల గణన ప్రాధాన్యతపై ఆందోళన వ్యక్తం చేసింది. గైని సాయి మోహన్ మాట్లాడుతూ, “ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల SC, ST, మరియు ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరుగుతోంది. కుల గణన ద్వారా మాత్రమే వీరికి న్యాయం జరుగుతుంది” అన్నారు.
గత ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తూ, రాష్ట్రంలో కేవలం 5% జనాభా మాత్రమే ఉన్నవారికి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం తప్పుడు విధానమని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల మెరిట్ తెచ్చుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఓపెన్ క్యాటగిరి అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ రిజర్వేషన్ల అమలుపై తక్షణ చర్యలు చేపట్టాలని సాయి మోహన్ డిమాండ్ చేశారు.