జడ్పిటిసి-ఎంపీపీ-సర్పంచులకు రిజర్వేషన్ల ఖరారు

జడ్పిటిసి-ఎంపీపీ-సర్పంచులకు రిజర్వేషన్ల ఖరారు

జడ్పిటిసి-ఎంపీపీ-సర్పంచులకు రిజర్వేషన్ల ఖరారు

ఆశావహుల్లో నెలకొన్న ఉత్సాహం

మనోరంజని ప్రత్యేక ప్రతినిధి సెప్టెంబర్ 27

నిర్మల్ జిల్లా పరిషత్ చైర్మన్ బిసి జనరల్ కు కేటాయించారు. త్వరలో జరిగే జడ్పిటిసి-ఎంపీపీ-సర్పంచులు-ఎపీటీసీ- వార్డ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. జడ్పీటీసీ రిజర్వేషన్ ఇలా ఉన్నాయి. బాసర బీసీ (మహిళ), తానూర్ (ఎస్సీ), బైంసా ఎస్సీ (మహిళ), కుంటాల (బీసీ), ముధోల్ బీసీ (మహిళ), లోకేశ్వరం (బిసి), కుబీర్ (జనరల్), లక్ష్మణచందా (ఎస్సీ జనరల్), సోన్ (బిసి మహిళ), ఖానాపూర్ (ఎస్టీ జనరల్), నర్సాపూర్ (జి) (బిసి మహిళ), సారంగాపూర్ (ఎస్టీ మహిళ), దస్తురాబాద్ (బీసీ జనరల్), దిలావర్పూర్ (జనరల్ మహిళ), కడెం (ఎస్టీ జనరల్), మామడ (జనరల్), పెంబి (జనరల్ మహిళ), నిర్మల్ రూరల్ (బీసీ జనరల్) కు కేటాయించారు. అదేవిధంగా ఎంపీపీ రిజర్వేషన్లు మండలాల వారీగా బాసర(ఎస్సీ), తానూర్ (జనరల్), బైంసా (ఎస్సీ మహిళ), కుంటాల (జనరల్ మహిళ), ముధోల్ (బీసీ మహిళ), లోకేశ్వరం (బీసీ జనరల్), కుబీర్ (ఎస్టి), లక్ష్మణ్ చందా (ఎస్సీ జనరల్), సోన్ (బీసీ జనరల్), నిర్మల్ రూరల్ (బీసీ మహిళ), ఖానాపూర్ (బీసీ మహిళ), నర్సాపూర్(జి) (బిసి జనరల్), సారంగాపూర్ (ఎస్టీ జనరల్), దస్తురాబాద్ (బిసి మహిళ), దిలావర్పూర్ (బిసి జనరల్), కడెం (ఎస్టీ మహిళ), మామడ (జనరల్), పెంబి (జనరల్ మహిళ) కు రిజర్వ్ చేశారు. మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలకు సైతం రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సైతం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment