తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 566 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను ఖరారు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వీటికి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది