రాష్ట్రస్థాయి పోటీలకు జడ్పీహెచ్ఎస్ భీమారం విద్యార్థులు.
మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.
మంచిర్యాల జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల లక్సట్టిపేట్ లో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల భీమారం విద్యార్థులు మనోజ్ అండర్ 16 ఇయర్స్ విభాగంలో 600 పరుగు పందెంలలో, సిహెచ్.జాను 18 సంవత్సరాల విభాగంలో షార్ట్ పుట్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటేశ్వర్లు. మరియు పాఠశాల పిడి ఈ మారయ్యలు ఒక ప్రకటనలో తెలియజేశారు.
వీరు ఈనెల 3 .4 తేదీలలో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలలో పాల్గొంటారని వారు తెలియజేశారు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు అభినందించారు