తెలంగాణకు రానున్న జేపీ నడ్డా
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబర్ 26, 2024: ఈనెల 28న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. ఆయన సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం, భాజపా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖ నేతలతో సమావేశం జరపనున్నారు. నగరంలోని బేగంబజార్‌లో జరగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొననున్నారు.