పీహెచ్డీ పట్టా అందుకున్న జౌల(కె) వాసి
తానుర్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 20
తానూర్ మండలంలోని జౌల(కె) గ్రామానికి చెందిన మాధవరావుకు హైదరాబాదులో డాక్టరేట్ లభించింది. గ్రామంలో అత్యంత బీద కుటుంబం ఆయిన జాజూల్వాడ్ రోహిదాస్- గంగబాయి దంపతుల కుమారుడు మాధవరావు ఉస్మానియా యూనివర్సిటీ 84వ వార్షికోత్సవ సందర్భంగా మంజుల్ భగత్ కె ఉపన్యాసో మే ఆధునిక సమాజ్ కే యథార్థ అనే అంశంపై డా.సంగీత వ్యాస్ మార్గదర్శకత్వంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ డా. నారాయణన్ చేతుల మీదుగా పీహెచ్డి పట్టా అందుకున్నారు. అయన బడుగు బలహీన వర్గానికి చెందిన (రజక) కులంలో పీహెచ్డీ పట్టా పొందిన మొదటి మండల వ్యక్తి కావడం విశేషం. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, సహచారులు, మిత్రుల సహాయంతో విజయాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ సందర్బంగా అయనకు మిత్ర బృందాలు, గ్రామస్తులు అభినందించారు.