- జెడ్లోడ్ శంకర్‌ని ముధోల్ మండల అధ్యక్షుడిగా నియమించగా.
- బాల్య వివాహాల నిర్మూలన, భూ కబ్జాలకు వ్యతిరేకంగా కృషి.
- పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా ప్రత్యేక చొరవ.
- డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల ప్రకారం నియామకం.
- బిద్రెల్లి గ్రామానికి చెందిన శంకర్‌కు కీలక బాధ్యత.
ముధోల్, డిసెంబర్ 15:
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (SJWHRC) ముధోల్ మండల అధ్యక్షుడిగా జెడ్లోడ్ శంకర్ నియమితులయ్యారు. డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. శంకర్ అన్యాయ అక్రమాలు, భూ కబ్జాలు, బాల్యవివాహాల నిర్మూలన, పేద కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.
ముధోల్, డిసెంబర్ 15:
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (SJWHRC) ముధోల్ మండల అధ్యక్షుడిగా జెడ్లోడ్ శంకర్ నియమితులయ్యారు. ఈ నియామకం డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల ప్రకారం, ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి, జిల్లా వైస్ చైర్మన్ లక్ష్మణరావు పటేల్, జిల్లా డైరెక్టర్ సింగ్ ఆధ్వర్యంలో జరిగింది.
జెడ్లోడ్ శంకర్ మాట్లాడుతూ, “సామాజిక సేవ నా లక్ష్యం. ఎక్కడ అన్యాయాలు, భూ కబ్జాలు జరుగుతున్నా, బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని నిర్మూలించడమే నా ప్రాథమిక బాధ్యత. పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాను,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భైంసా మండల డైరెక్టర్ అడెల్లి సాయికిరణ్, భైంసా మండల వైస్ చైర్మన్ టి. వెంకటేష్, కదం ఆకాశ పటేల్ తదితరులు పాల్గొన్నారు.