జెడ్పీటీసీ బరిలో ఉద్యమకారుడు?
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – భైంసా
రానున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో కుంటాల జెడ్పీటీసీ టికెట్ కోసం స్థానిక నాయకుడు దొనికెని వెంకటేష్ ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ఆయన స్థానిక మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డిలను కలసి తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
దొనికెని వెంకటేష్ గతంలో కుంటాల ఎంపీటీసీగా, సర్పంచ్‌గా పనిచేసి ప్రజలకు సేవలందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మండల జేఏసీ కన్వీనర్‌గా వ్యవహరించి గ్రామాల ప్రజలను ఉద్యమ పట్ల చైతన్యం చేశారు. కుంటాల–కల్లూరు రహదారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి విజయాన్ని సాధించారు.
అలాగే రైతుల కోసం పలుమార్లు పోరాటం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అనేక మందిని తన వాహనంలో ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం కూడా ఆయన మండల కేంద్రంలో నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల కనీస అవసరాల కోసం కృషి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, దొనికెని వెంకటేష్ జెడ్పీటీసీ బరిలోకి దిగితే ఎన్నికల్లో బలమైన పోటీదారుగా నిలుస్తారనే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది.