జనహిత పాదయాత్రకు జన నీరాజనం
ఖానాపూర్ నియోజకవర్గంలో కదంతొక్కిన పార్టీ శ్రేణులు
సూర్జాపూర్ లో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు అపూర్వ స్వాగతం
ఖానాపూర్ వరకు అడుగడుగునా బ్రహ్మరథం
అందరినీ ఆప్యాయంగా పలకరించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్
మనోరంజని ప్రతినిధి ,ఖానాపూర్ ఆగస్టు 03
ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదివారం రోజు నిర్మల్ జిల్లాలో చేపట్టిన జనహిత పాదయాత్రకు అడుగడుగునా నీరాజనం పలికారు. ఖానాపూర్ నియోజకవర్గం సూర్జాపూర్ గ్రామం వద్ద గజమాలతో ఘనస్వాగతం పలికారు.
పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్ వెంట టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి అనసూయ సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పార్టీ శ్రేణులు, ప్రజలు నడిచారు. సుర్జాపూర్ గ్రామ శివారు నుంచి కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు జనహిత పాదయాత్రకు తరలిరావడంతో రహదారులు కిటకిటలాడాయి. మహిళలు, యువకులు, ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి అనసూయ సీతక్క,
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు,
కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాల చారి, శ్రీహరి రావు, విఠల్ రెడ్డి, ఆత్రం సక్కు, సోయం బాపురావు, రేఖశ్యామ్ నాయక్ , నారాయణరావు పటేల్, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శిందే ఆనందరావు పటేల్, ఆత్రం సుగుణ, ఆడే గజేందర్, కంది శ్రీనివాస్ రెడ్డి, ఎంబడి రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు