కనీస వేతనాలు చెల్లించని అధికారులను సస్పెండ్ చేయాలి జనసేన డిమాండ్.. సుంకిట మహేష్ బాబు

*కనీస వేతనాలు చెల్లించని అధికారులను సస్పెండ్ చేయాలి జనసేన డిమాండ్*
భైంసా పట్టణం లోని మున్సిపాలిటీలో గత రెండు రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ మల్టిపర్పస్ కార్మికులు ధర్నా చేస్తున్నారు.
వీరికి మద్దతుగా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు హాజరై మాట్లాడుతూ
గత కొన్ని సంవత్సరాలుగ వివిధ విభాగల్లో కాయ కష్టం చేస్తున్న అభాగ్య జీవుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది.వీరికి కనీస వేతనం జిఓ ప్రకారం చెల్లించకుండా కేవలం పది వేలు మాత్రమే జీతం ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు.మిగితా జిల్లా లోని మున్సిపాలిటీలో ఇస్తున్న దాని ప్రకారం కూడ వేతనం ఇవ్వడం లేదు. దీనికి తోడు పిఎఫ్ పేరిట కొన్ని సంవత్సరాలనుండి అస్సలు డబ్బులు జమ కావడం లేదు. కనీసం మెసేజ్ లు కూడ రాకపోవడం చాలా విడ్డురం. ఇందులో ఎదో అవినీతి జరుగుతుందని వాపోయారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న అధికారులపై సమగ్ర విచారణ జరిపి సబ్ కలెక్టర్ గారు వారిపై చట్ట రీత్యా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా జిఓ ప్రకారం వేతనాలు 5వ తేదీ లోపు సరైన సమయానికి చెల్లించి పిఎఫ్ డబ్బులు క్లియర్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని యెడల కార్మికుల పక్షాన అండగా నిలబడి భవిష్యత్ లో జరిగే పోరాటానికి పూర్తి స్థాయి మద్దుతూ తెలియచేస్తామని హెచ్చరిస్తున్నాం. దీనికి పూర్తి భాద్యత ప్రభుత్వమే వహించాల్సి వస్తుంది. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కార్మికులు ఆరిఫ్, ప్రకాష్, సలీమ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment