జామ్ గురుకుల విద్యార్థినులకు చెస్ పోటీల్లో విజయం
జిల్లా స్థాయి అండర్–14,17 చెస్ పోటీల్లో ప్రతిభ — జోనల్ స్థాయికి ఎంపిక
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి అక్టోబర్ 17
నిర్మల్ జిల్లా అల్పోర్స్ స్కూల్‌లో అక్టోబర్ 16న నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–14,17 చెస్ పోటీల్లో సారంగాపూర్ మండలం జామ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో ఎన్. శ్రీనిధి, ఎన్. అద్విత జోనల్ స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకి గర్వకారణమైంది.
ఎన్. శ్రీనిధి బంసపెల్లి గ్రామానికి చెందిన ఎన్. సాయన్న–రజిత దంపతుల కుమార్తె కాగా, ఎన్. అద్విత మాదాపూర్ గ్రామానికి చెందిన పవన్‌కుమార్–మమత దంపతుల కుమార్తె. ఇద్దరూ వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు. వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన పి ఈ టి సుస్మిత, పి డి సుప్రియ లను పాఠశాల ప్రిన్సిపాల్ బి. సంగీత మేడం మరియు సిబ్బంది అభినందించారు. విద్యార్థినులు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.