నూతన సర్పంచ్ సంగమేశ్వర్‌కు జాజాల సురేందర్ శుభాకాంక్షలు
కామారెడ్డి జిల్లా బాణాపూర్ గ్రామ ప్రతినిధుల మర్యాదపూర్వక భేటీ
మనోరంజని తెలుగు టైమ్స్ లింగంపేట్, డిసెంబర్ 08 :
కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్ మండలం బాణాపూర్ గ్రామ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కూద సంగమేశ్వర్, ఉపసర్పంచ్ దప్పు సంజీవులు, వార్డ్ మెంబర్స్ ఐలాపురం రవీందర్, నక్క వెంకటేష్, సిపిఐ నాయకుడు గొల్ల పరమేశ్వర్లు సోమవారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.బాణాపూర్ గ్రామ నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్, గ్రామాభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రామ స్థాయి సమస్యల పరిష్కారంలో ప్రజల అంచనాలు నెరవేర్చేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, నాగిరెడ్డిపేట మాజీ జడ్పీటీసీ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సిద్దయ్య, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు దాసరి సాయిలు, మాజీ సర్పంచ్ బండి నర్సింలు, మాజీ ఎంపీపీ సాయిలు తదితరులు పాల్గొన్నారు.