సరైన సమయంలో కేసీఆర్ కు మద్దతుగా రంగంలోకి జగన్..!!

సరైన సమయంలో కేసీఆర్ కు మద్దతుగా రంగంలోకి జగన్..!!

సరైన సమయంలో కేసీఆర్ కు మద్దతుగా రంగంలోకి జగన్..!!

ఏపీ మాజీ సీఎం జగన్ తెలంగాణ రాజకీయాల్లో తెర మీదకు వచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి లో చంద్రబాబు కంటే.. వైఎస్సార్.. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కవని చెప్పుకొచ్చారు.

ఎవరు ఏం చేసారో వివరించారు. 2017 నుంచి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్న జగన్ తాజాగా హైదరాబాద్ అభివృద్ధి లో కేసీఆర్ గురించి ప్రస్తావించిన అంశాలు జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఆసక్తి కరంగా మారాయి. కేసీఆర్ కు పరోక్షంగా జగన్ మద్దతుగా నిలుస్తున్నారనే చర్చ మొదలైంది. జగన్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ఈ ఎన్నిక వేళ కొంత మేర బూస్టింగ్ గా కనిపిస్తోంది.

ఏపీ – తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్ – కేసీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ చంద్రబాబు లక్ష్యంగా రాజకీయం చేసిన నేతలే. 2019 లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు. ఆ తరువాత హైదరాబాద్ కు జగన్.. అమరావతికి కేసీఆర్ వచ్చిన సమయంలో కలిసి సుదీర్ఘ చర్చలు చేసారు. ఇద్దరూ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్ల ఓడిపోయారు. అయినా.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గలేదు.

ప్రత్యక్షంగా కలవకపోయినా.. పలు సందర్భాల్లో పరోక్షంగా ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఇద్దరూ ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు. కాగా, జూబ్లీహిల్స్ బై పోల్ లో గెలుపు కేసీఆర్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఎన్నిక పైన సమీక్షలు నిర్వహిస్తున్న వేళ జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతల్లో ఆసక్తి కర చర్చగా మారాయి.

జూబ్లీహిల్స్ లో ఇప్పుడు సామాజిక వర్గాల ప్రాబల్యమే గెలుపు ఓటములను డిసైడ్ చేయటం పక్కా గా కనిపిస్తోంది. అందులో భాగంగానే మాగంటి గోపీనాథ్ సతీమణినే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎంపిక చేసారు. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయినా.. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టారు. ఇక.. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కేసీఆర్ స్వయంగా గెలుపు కోసం వ్యూహలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ మాజీ సీఎం జగన్.. హైదరాబాద్ అభివృద్ధి లో కేసీఆర్ పాలనా పరమైన నిర్ణయాలను ప్రశంసించారు.

హైదరాబాద్ అభివృద్ధి లో వైఎస్సార్.. కేసీఆర్ పాత్ర కీలకం అని చెప్పుకొచ్చారు. తెలంగాణా సహా హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారు అన్న జగన్ మాటలు ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ వేళ కీలకంగా మారుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ఏపీ నుంచి వచ్చి స్థిర పడిన ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. అయితే, ఇప్పుడు జగన్ సరైన సమయం లో కేసీఆర్ బ్రాండ్ పెరిగేలా చేసిన వ్యాఖ్యలు గులాబీ టీంకు మాత్రం జోష్ పెంచేలా కనిపిస్తున్నాయి

Join WhatsApp

Join Now

Leave a Comment