ఐటిఆర్ దాఖలు గడువు నేటితో ముగింపు!

ఐటిఆర్ దాఖలు గడువు నేటితో ముగింపు!

ఐటిఆర్ దాఖలు గడువు నేటితో ముగింపు!

మనోరంజని  ప్రతినిధి

హైదరాబాద్:సెప్టెంబర్ 16
ఆదాయ పన్ను రిటర్నుల ఐటీఆర్,దాఖలు విషయం లో పన్ను చెల్లింపుదారు లకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఊరట కల్పించింది. 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను (ఐటీ) విభాగం ఐటీ రిటర్నుల గడువును పొడిగించింది.

సెప్టెంబరు 15తోనే ఐటీ రిటర్నుల దాఖలుకు చివరి గడువు కాగా.. ఆదాయపు పన్ను విభాగం ఆ గడువు ను ఒకరోజు పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఆలస్యంగా ఈ ప్రకటన విడుదలైంది.

2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను లు ఐటీఆర్‌లు, దాఖలు చేయడానికి గడువు తేదీని మొదట ఈ ఏడాది జూలై 31న గడువుగా నిర్ణయించారు. కానీ,మళ్ళీ ఆ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు.

అయితే, సోమవారం గడువు ముగుస్తుండటంతో చివరి నిమిషంలో లక్షలాది మంది పన్ను చెల్లింపుదా రులు ఒకేసారి ఫైలింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించా రు. దీంతో పోర్టల్ పై ఒత్తిడి పెరిగి.. పలు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి.

ఈ పరిణామాల నేపథ్యం లో తాజాగా.. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ ఐటీఆర్ఎస్‌లను దాఖలు చేయడానికి గడువును ఈరోజు మంగళవారం వరకు పొడిగిస్తూ నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.

జులై 31వ తేదీ నాటికి దాఖలు చేయాల్సిన ఐటీల దాఖలు గడువు తేదీని మరో రోజుకు పొడిగించి నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది

Join WhatsApp

Join Now

Leave a Comment