కార్మికులు,రైతుల కోసం పోరాడుతున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ గారిని అరెస్ట్ చేయడం అన్యాయం!
మంగంపేట త్రివేణి సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఖండన,
రైల్వే కోడూరు నియోజకవర్గం లోని కార్మికులు రైతులు, సమస్యలపై అధికారులు ప్రభుత్వం దృష్టికి, తీసుకెళ్తూ, రాజీ లేని పోరాటం చేస్తున్న, సిఐటియు జిల్లా అధ్యక్షులు, మండల కార్యదర్శి ఈ జాన్ ప్రసాద్ ని, అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని మంగంపేట, మైనింగ్ వర్కర్స్ యూనియన్, సిఐటియు , అనుబంధం, అధ్యక్ష కార్యదర్శులు పుల్లగంటి శ్రీనివాసులు, ముత్యాల శ్రీనివాసులు, తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాతంలో రైతులు పండిస్తున్న పంటలకు గిట్టు బాటు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే, దళారుల దోపిడీకి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీఐటీయూ నాయకత్వం రైతులకు న్యాయం చేయాలని గత రెండు నెలల కాలంగా పోరాటం చేస్తుంటే, జిల్లా కలెక్టర్ గారు వచ్చి బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర ఆగష్టు ఆరవ తారీకు నుండి 10 రూపాయలు చెయ్యాలని చెప్పినా కలెక్టర్ గారి మాట వినకుండా, ఉన్న రేటునే ఉన్నపలంగా 5 రూపాయలు చెయ్యటంతో, రైతులు తీవ్ర మనోవేదనకు లోనై రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారి బాధలు చెప్పుకోవాలని అనుకుంటే వారి బాధను చెప్పుకోనివ్వకుండా రాత్రి కి రాత్రి ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడం చాలా అన్యాయం, ఇది చాలా
దుర్మార్గం, దీనిని సీఐటీయూ గా మేము ఖండిస్తున్నామని తెలిపారు, వెంటనే ప్రభుత్వం అధికారులు జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలని, అరెస్ట్ చేసిన మా సీఐటీయూ నాయకులను, రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.