జాతిని తీర్చి దిద్దేది గురువులే

జాతిని తీర్చి దిద్దేది గురువులే

జాతిని తీర్చి దిద్దేది గురువులే

జాతిసమగ్రాభివృద్ధిసమాజాన్ని సమున్నత విలువలు గల వ్యక్తులను తయారు చేసే శక్తి సామర్థ్యాలు గురువులకు మాత్రమే ఉంటాయి.

గురువు_ ప్రభావశీలపాత్ర

పిల్లల సమగ్ర వికాసంలో తల్లి తండ్రుల తర్వాత గురువు ప్రభావశీలమైన పాత్ర పోషిస్తాడు.

గురువు _విజ్ఞాన శక్తి

విజ్ఞానం వికాసం సంపూర్ణ వ్యక్తిత్వం వైపు సమాజాన్ని నిరంతరం నడిపించగల శక్తి ఉపాధ్యాయులకి ఉంటుంది.

గురువులు _ మనిషిని మహనీయునిగా తీర్చిదిద్దే
శక్తి

పిల్లలకు తల్లిదండ్రులు తమ ప్రవర్తనద్వారాఆదర్శప్రాయులు కాగలరు. బాల్యంలోనే నైతికవిలువలు మానవీయ విలువలు సమాజంలో బంధాలు అనుబంధాలు నేర్పించగలరు.
గురువులు కేవలం విజ్ఞానాన్ని అందించే మర యంత్రాలు కాకూడదు.పిల్లల్లో విచక్షణ జ్ఞానాన్ని శాస్త్రీయ దృక్పథాన్ని పెంచి పరిశీలన పరిశోధన పరికల్పన ప్రక్రియల్లో కావలిసిన శిక్షణ ఇవ్వాలి. మనిషిని మహనీయునిగా తీర్చిదిద్దే శక్తి గురువుకు మాత్రమే ఉంటుంది.

గురువులు_ ఉత్తమ పౌరుల నిర్మాణం

ఉపాధ్యాయులు పిల్లల్లో
తార్కికఆలోచనలు పెంచడం సృజన నైపుణ్యాలను అభివృద్ధి పరచడం. పాజిటివ్ పదాన్ని పాదు కోల్పోవడం. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ప్రజాస్వామిక దృక్పథంతో జీవితంలో ముందుకు వెళ్ళే వ్యక్తులను తయారు చేయడం భావి పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులధే అలాంటి ప్రగతి శీల ఉపాధ్యాయలు సమాజానికి తక్షణ అవసరం.

పెరిగిన పాఠశాలలు_
పెరగని విద్యా ప్రమాణాలు

దేశంలో 14.71 లక్షల పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో కోటికి పైగా టీచర్స్ పనిచేస్తున్నారు. 79 సంవత్సరాల స్వతంత్ర భారత్ 14 శాతం ఉన్న అక్షరాస్యత 70 శాతం పైగా పెరిగింది. స్కూలళ్లో పనిచేసే టీచర్స్ సంఖ్య పెరిగింది. రాశి పెరిగింది.కానీవిద్యాప్రమాణాలవాసిఅనుకున్నంతపెరగలేదు.
ప్రపంచీకరణ పోటీతత్వం పెరిగింది మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశ పెట్టడంలో ప్రభుత్వాలు విఫలమైనాయి. పోటీ పరీక్షలు నెగ్గుకు వచ్చే విధంగా విద్యార్థులను తయారు చేయడములో విద్యారంగం విఫలమైంది.

కొరవడిన _ఆధునిక ఉపాధ్యాయ శిక్షణ
విద్యార్థుల్లో సృజన నైపుణ్యాల అభివృధి నేర్చుకున్న విజ్ఞానాన్ని పని చేయటానికి అనువర్తించే మెళుకువలు అవగాహన సామర్థ్యాలు లోపించాయి.
విద్యార్థుల్లో అధునాతన స్కిల్స్ నేర్పే ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉంది.
ప్రభుత్వాల ఉదాసీనత నిర్లక్ష్యం వల్ల విద్యారంగంలో నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ కొరబడింది. దీనివల్ల పిల్లల మానసిక స్థితిని గుర్తించి బోధించే టీచర్లులేరు.
పిల్లలను బాధించే టీచర్స్ సంఖ్య ఎక్కువగా ఉంది.ఈ పరిస్థితి వల్ల చాలామంది పిల్లలు మధ్యలోనే బడి మానేసి బాల కార్మికులుగా మారుతున్నారని పలు విద్యా నివేదికలు ఘోషిస్తున్నాయి.

సుశిక్షితులైన టీచర్ల సంఖ్య పెరగాలి.
భవనానికి బలమైన నాణ్యమైన పునాదులు ఎంత అవసరమో
దేశం అభివృద్ధి చెందడానికి సుశిక్షిత మానవ వనరులు
అంతే అవసరం.
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పురోగమించాలంటే
సుశిక్షితులైన టీచర్స్ సంఖ్య పెరగాలి. ఇందుకు దక్షిణ కొరియాను ఉదాహరణగా పేర్కోవచ్చు. అక్కడ అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను బోధన రంగం వైపు ఆకర్షిస్తున్నారు. అధిక జీతభత్యాలు ఇతర సౌకర్యాలు కల్పించడం వల్ల విదార్థుల్లో సృజన నైపుణ్యాలను స్కిల్స్ ను అభివృద్ధి పరిచి మానవ వనరుల వికాసానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జపాన్ సింగపూర్ లాంటి దేశాలు విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ అత్యంత ప్రాధాన్యత రంగంగా విద్యారంగాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. ఆ దేశాలు ఆర్థికంగా అభివృధి చెందాయి.జపాన్ సింగపూర్ దేశాలు అవలంబించిన తరహా విధాభివృధి వ్యూహాలు ప్రణాళికలు మన దేశములో
అమలుచేయాలి.

ప్రభుత్వం _ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దేశంలో అనేక బీ ఈ డీ కళాశాలలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. బోధన సౌకర్యాలు కొరబడ్డాయి. అవస్థాపన సౌకర్యాలు లేవు.విద్యా అధికారుల పర్యవేక్షణ వ్యవస్థ నీరుగారిపోయింది .కార్పొరేట్ విద్య పేదలకు దూరమైంది. ప్రైవేట్ స్కూళ్లలో నైపుణ్యాలు లేని ఉపాధ్యాయులు పనిచేయడం వల్ల విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఆశించిన మేరకు పెరగలేదు.

తరుగుతున్న విద్యా ప్రమాణాలు

ఐదవ తరగతి చదువుతున్న పిల్లలు 2వ తరగతి పాఠ్యాంశాలు చదవలేక పోతున్నారు. గణితంలో చాలా వెనకబడి ఉన్నట్లు విద్యా ప్రమాణాలు తగ్గినట్లు అనేక విద్యా నివేదికలు తెలియచేశాయి.

ప్రభుత్వాలు క్రింది చర్యలు తీసుకోవాలి.

1)పాఠశాలలో చిన్నారుల అభ్యసన ప్రక్రియను మెరుగు పరచాలి. క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
2)బూజు పట్టిన పాత విధానాలను విడనాడాలి. పిల్లల్లో అధ్యయన అభ్యాసన ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలి.
3)ప్రస్తుతం ప్రపంచం ఎ ఐ గా మారిపోతున్న తరుణంలో టీచర్లకు నవీన సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. డిజిటల్ ఎడ్యుకేషన్ లో శిక్షణ ఇవ్వాలి. 4)జాతీయ విద్యా విధానం సూచించినట్లు జిడిపిలో 6 శాతం నిధులు విద్యా రంగానికి కేటాయించాలి.
5)విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంచటానికి చరిత్ర సామాజిక శాస్త్రాలు అధ్యయనాన్ని ప్రోత్సహించాలి.

6)పిల్లలను లైంగిక వేధింపులకు పాల్పడే మనస్తత్వం ఉన్న వ్యక్తులను టీచర్లుగా నియమించకూడదు.
7)బోధనా రంగంలోకి వారిని నిషేధించాలి.
8)విద్యార్థులకు ఉచిత ఆరోగ్య వైద్య పరీక్షలు కౌన్సెలింగ్ కేంద్రాలు ప్రతి పాఠశాలలో నెలకొల్పాలి

9)సంస్థాగత సంస్కరణలు
విద్యారంగంలో సంతగత పాలన సంస్కరణలు చేపట్టాలి.
10) ప్రతిభావంతులైన యువతను విద్యారంగం వైపు ఆకర్షించే చర్యలు చేపట్టాలి.
11) ఉపాధ్యాయులకు సకాలంలో జీతంభత్తాలు చెల్లించాలి. పదోన్నతులు కల్పించాలి
12) మానవ వనరుల వికాసంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ లోకంలో నూతన వెలుగులు తేవయడానికి ప్రభుత్వం సమగ్ర విద్యాసంస్థలు చేపట్టాలి.
ఉపాధ్యాయ దినోత్సవం స్పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించాలి.
జాతిని తీర్చిదిద్దే గురువులను
వారి సేవలను గుర్తించే సంకల్పానికి నాంది పలకాలి.

(ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాసిన ఆర్టికల్)

నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక కరీంనగర్ 9440245771

Join WhatsApp

Join Now

Leave a Comment