సమతా కుంభ్ లో ప్రతిభ కనబరిచిన చిన్నారి ఐరారెడ్డి.
నిర్మల్ జిల్లా – సారంగాపూర్ :
శ్రీరామానుజాచార్య- తృతీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముచింతల్ లో గల సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఆదివారం జరిగిన మహానాట్య బృందం 4 రికార్డ్స్ నమోదు చేసింది.
ఘంటసాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాల నుంచి వచ్చిన 3 వేల మంది చిన్నారులు వివిధ నృత్య రూపాలతో చేసారు .ఇండియన్ వరల్డ్ రికార్డు,వండర్ బుక్ అఫ్ రికార్డ్స్, నృత్య
గోల్డెన్ స్టార్ రికార్డు,జీనియస్ బుక్ అఫ్ రికార్డ్స్ వంటి నాలుగు రికార్డులను అందజేశారు.
అందులో భాగంగా మండలం లోని బోరిగామ్ గ్రామానికి చెందిన బెజ్జంకి లక్ష్మీ – ముత్యం రెడ్డి ల కుమార్తె చిన్నారి ఐరా రెడ్డి నృత్యంలో ప్రతిభ కనబరిచింది చిన్నరికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గోల్డెన్ స్టార్ రివార్డ్ ను అందజేసి ఆశీర్వదించారు.ఈ సందర్బంగా చిన్నారిని పలువురు మండలవాసులు అభినందించారు