అడెల్లి పోచమ్మ అమ్మవారి పునః ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం
మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారికి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వాన పత్రిక అందజేత
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 01
నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి పోచమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే పునః ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ సింగం భోజ గౌడ్, సారంగాపూర్ మాజీ జెడ్పిటిసి సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి కలిసి మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి ను ఆయన కొంపల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, మహోత్సవానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. నవంబర్ 3 నుండి 7 వరకు వేద పండితుల ఆధ్వర్యంలో అడెల్లి మహా పోచమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించబడనుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు, ప్రాంతీయ నాయకులు విస్తృతంగా పాల్గొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ చైర్మన్తో పాటు సారంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఉట్ల రాజేశ్వర్, సాయి కృష్ణ గౌడ్, భూమేష్ మరియు ఇతరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.