జిల్లా అదనపు కలెక్టర్ బ్యాంకులకు సూచనలు – ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

జిల్లా అదనపు కలెక్టర్ బ్యాంకులకు సూచనలు – ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

మనోరంజని తెలుగు టైమ్స్ – అక్టోబర్ 17, 2025

జిల్లా అదనపు కలెక్టర్ బ్యాంకులకు సూచనలు – ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉన్నట్టు పేర్కొన్నారు.

అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిస్తున్న వివిధ రుణాలపై బ్యాంకర్లు విస్తృత అవగాహన కల్పించాలి. కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఉపసంహరణ నిధులను గుర్తించి, సంబంధితులందరికీ బ్యాంకు నియమాలను పాటిస్తూ అందజేయాలని, వెనుకబడిన తరగతుల ప్రజలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతులు, వీధి వ్యాపారస్తులు, విద్యార్థుల రుణాల మంజూరులో ఆలస్యం చేయకూడదని సూచించారు.

అలాగే సైబర్ నేరాల పట్ల బ్యాంకు సిబ్బందికి ప్రజలకు అవగాహన కల్పించడం అవసరమని, విస్తృత అవగాహన ద్వారా మాత్రమే సైబర్ నేరాలను నియంత్రించవచ్చని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా ప్రజలకు అందజేసిన రుణాల వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్, ఎస్బిఐ ఆర్ఎం రామచంద్ర రావు, జిల్లా అధికారులు, బ్యాంకర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment