కడ్తాల్ లో వైభవంగా ఆంజనేయస్వామి ఆలయం ఎదుట గజ స్థంభం ప్రతిష్టాపన…
.. పాల్గొన్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ వి. శోభారాణి సత్యనారాయణ గౌడ్.
మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ ఆగస్టు 03 – . సోన్ మండలం కడ్తాల్ ఎన్.హెచ్ 44 జాతీయ రహదారి పడమటి ముఖ ద్వారం ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట ఆదివారం గజ స్థంభం (ఏకశిల)ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రోచ్ఛరణ మధ్య ఘనంగా నిర్వహించారు. అదిలాబాద్ ఉమ్మడి మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వి. శోభారాణి, సత్యనారాయణ గౌడ్ దంపతులు గార్లు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంజనేయస్వామి అనుగ్రహంతో ప్రజలకు మేలు కలగాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు బర్మ రాజ నరసయ్య, పిఎసిఎస్ మంజులాపూర్ వైస్ చైర్మన్ బి .గంగాదాస్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్, బర్మ రవీందర్, మాజీ ఉప సర్పంచ్ భీమేష్ నాయకులు కే. లక్ష్మారెడ్డి, మద్దెల గంగాధర్,గుర్రం ఆశన్న, బర్మ శ్రీకాంత్, పూజారి రాజేశ్వర్ గారు, నాయకులు అంకం రవి, గుర్రం గంగన్న, సాయన్న గ్రామ ప్రజలు ,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు