ఇంద్రమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలి
మండల ప్రత్యేక అధికారి సుదర్శన్ రాథోడ్
ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 18
ఇంద్రమ్మ ఇళ్ళను త్వరితగతిన లబ్ధిదారులు పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి సుదర్శన్ రాథోడ్ అన్నారు. మండలంలోని తరోడ గ్రామంలో గల ఉర్దూ మీడియం పాఠశాలలో రికార్డ్స్- మధ్యాహ్న భోజనశాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ను ప్రారంభించారు. వెంకటపూర్ గ్రామంలోని ఇంద్రమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులకు పూర్తి చేయాలని సూచించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించి రోగులకు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మందుల వివరాలను సైతం కనుక్కున్నారు. ఆయన వెంట ఎంపీడీవో శివకుమార్, ఏపీఓ శిరీష, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులున్నారు