ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పకడ్బందీగా చేపట్టాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పకడ్బందీగా చేపట్టాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పకడ్బందీగా చేపట్టాలి

ముధోల్ తహసీల్దార్ శ్రీకాంత్

మనోరంజని ( ప్రతినిధి )

ముధోల్ : డిసెంబర్ 12

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియలో దరఖాస్తుదారుల వివరాలను పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని ఎంపీడీఓ శివకుమార్-తహసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. గురువారం ముధోల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై సూచనలు అందజేశారు. ఎంపిడిఓ శివకుమార్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో ఇండ్లు లేవని దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు సంబంధించి పూర్తి సర్వే నిర్వహించి, వివరాలను యాప్ లో పొరపాట్లు లేకుండా నమోదు చేయాలన్నారు. ప్రతి 500 ఇండ్లకు ఒక సర్వేయర్ ను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలిసి సర్వే పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment