కేంద్రం సహకరించకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఆగవు: పొంగులేటి
కేంద్రం సహకరించకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఆగవు: పొంగులేటి
తెలంగాణ : కేంద్రం సహకరించకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఆగవని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగాలేకపోయినా సీఎం ఆలోచనకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రంపై ఆధారపడలేదని, కేంద్రం అనేక నిబంధనలతో కొర్రీలు వేస్తోందన్నారు. ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.52 లక్షలు కేంద్రం ఇస్తుందని చెప్పారు