ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం
ఇంగ్లాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్టులో టీమ్ఇండియా సంచలన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-2తో ముగించింది. 374 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 339/6తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.