పాకిస్తాన్ ను మరోసారి మట్టి కరిపించిన భారత్!*

*పాకిస్తాన్ ను మరోసారి మట్టి కరిపించిన భారత్!*

*మరోసారి నీచమైన బుద్ధి ప్రదర్శించిన పాకిస్తాన్!*

హైదరాబాద్:సెప్టెంబర్ 22
ఆసియా కప్‌2025 లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన సూపర్ ఫోర్స్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 6 వికెట్ల తేడాతో మళ్లీ మట్టి కరిపించింది, ఈ విజయంతో టీమ్ ఇండి యా టోర్నమెంట్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు చేసి రాణించాడు. ఫాఖర్ జమాన్ (15), సైమ్ అయూబ్ (21), మహమ్మద్ నవాజ్ (21) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో శివమ్ దూబే 33 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా కేవలం 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి పాకిస్తాన్ పై ఘన విజయాన్ని సాధించింది విజయాన్ని అందుకుంది. దీంతో భారత చేతిలో ఘోర పరాభవం మూట కట్టుకుంది, పాకిస్తాన్ టీం స్టేడియంలో కొద్దిసేపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది, అయినా ఓటమి తప్పలేదు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చారు.

అభిషేక్ శర్మ 39 బంతుల్లో 74 పరుగులు చేయగా, గిల్ 28 బంతుల్లో 47 పరుగులు చేశాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పా రు. అయితే, ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కావడం, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (13) త్వరగా ఔటవడంతో కొద్దిగా ఒత్తిడి పెరిగింది. కానీ, తిలక్ వర్మ (30 నాటౌట్ హార్దిక్ పాండ్యా 7 నాటౌట్, నిలకడగా ఆడి మరో 7 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు.

*పాకిస్తాన్ బుద్ధి మారదా?*

గత మ్యాచ్లో భారత్ జట్టు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తో పాటు… యుద్ధం సైని కుల ప్రస్తావన తీసుకొచ్చి క్రీడలతో రాజకీయాలు చేసిందని పాకిస్తాన్ నుంచి ఆరోపణలు వచ్చాయి,ఈ ఆరోపణల వల్ల భారత్ ఎటువంటి నష్టం లేదు, అయితే పాకిస్తాన్ మాత్రం అలాంటి రెచ్చగొట్టే పనులు సైగలను,తగ్గించుకోమని, మా బుద్ధి మారదు అని మరోసారి నిరూపించు కుంది,

34 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఫర్హాన్ తన బ్యాట్ ను ఏకే 47 గన్ తరహాలో ఎక్కు పెట్టి కాలుస్తున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు ఉద్దేశపూర్వకంగానే చేసిన ఈ సిగ్నల్ వారి నీచమైన ఆలోచన విధానాన్ని మరో సారి నిరూపించుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment