ASIA CUP 2025: విజేతగా భారత్
ఆసియా కప్ 2025లో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ కష్టపడి ఛేదించింది. 19.4 ఓవర్లలో టీం ఇండియా 150 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(69*), శివం దూబే(33), సంజు శాంసన్(24) రాణించారు. ఈ విజయంతో భారత్ ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.