పాకిస్తాన్ ను మట్టి కరిపించిన భారత్!
మనోరంజని ప్రతినిధి
హైదరాబాద్:సెప్టెంబర్ 15
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. విజయం తర్వాత, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు. అతను ప్రత్యర్థి జట్టు వైపు కూడా చూడలేదు. ఆ తర్వాత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత, టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కూడా పహల్గామ్ దాడి గురించి మాట్లాడాడు.
ఈ విజయాన్ని దేశ సైన్యా నికి అంకితం చేస్తున్నానని, ఈ విజయం ధైర్యసాహసా లు ప్రదర్శించిన దేశ సాయుధ దళాలకు అంకితం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు భారత జట్టు పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిం ది. విజయం తర్వాత, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత ప్రెజెం టేషన్ కోసం వచ్చాడు. మైదానంలో ఉన్న ప్రేక్షకులు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సూర్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 14న 35 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మేరకు ప్రేక్షకుల శుభాకాంక్ష లకు స్పందించిన సూర్య, ‘ ఇది భారతదేశానికి గొప్ప అనుభూతి, ఫ్యాన్స్ కు రిటర్న్ గిఫ్ట్’ అని అన్నాడు.
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో గెలవాలని ఎప్పుడూ కోరుకుంటానని ఒప్పుకున్నాడు. కానీ, టీం ఇండియా అన్ని జట్లపై గెలవడానికి సన్నాహాలు చేస్తోంది. ఆటగాళ్లను కూడా ఆయన చాలా ప్రశంసించారు.
ఇదే విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘మనం ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటాం, గెలిచినప్పు డు, అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నేను ఎప్పుడూ ఇదే కోరుకుంటాను. మేం అన్ని ప్రత్యర్థులకు సమానంగా సిద్ధమవుతాం. కొన్ని నెలల క్రితం ఇలాగే జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన జట్టు టోన్ సెట్ చేసింది. నేను ఎప్పుడూ స్పిన్నర్ల అభిమానిని. ఎందుకంటే, వారు ఆటను మధ్యలో ఊహించని విధంగా మార్చేస్తారు‘ అని తెలిపాడు