కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్

కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్

TPDPMA పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్ కొనసాగింపు

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోరుతూ ఆందోళన

అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 04

తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ & పీజీ కళాశాలల మానేజ్మెంట్ అసోసియేషన్ (TPDPMA) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్ రెండవ రోజు కొనసాగుతోంది. సారంగాపూర్ మండలంలోని ఏకలవ్య మరియు పద్మావతి డిగ్రీ కళాశాలలు ఈ బంద్‌లో భాగంగా తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. కళాశాల ప్రిన్సిపల్ అహ్మద్ పాషా, శ్రీనివాస్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల కళాశాలలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోవడం, నిర్వహణ ఖర్చులు భరించలేకపోవడం వంటి సమస్యలు తీవ్రతరమవుతున్నాయని చెప్పారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ కళాశాలల అధ్యాపక బృందం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో యాజమాన్యం సభ్యులు రమేష్, గణేష్, అధ్యాపకులు రాజేశ్వర్, సాయికుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment