ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచండి

ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచండి

ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచండి

ఇంటర్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు

ముధోల్ మనోరంజని ప్రతినిధి, జూలై 17

ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఇంటర్మీడియట్ బోర్డ్ హైదరాబాద్ జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖి చేశారు. అనంతరం సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థుల హాజరు శాతాన్ని సైతం పెంచాలని పేర్కొన్నారు. ప్రిన్సిపల్- అధ్యాపకులు-విద్యార్థులు సమయపాలన పాటించాలని సూచించారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని అన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో కలిపిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ అబ్దుల్ రెహమాన్, అధ్యాపకులు గంగాధర్, ప్రశాంత్, గణేష్, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment