ఇందూరు స్వర్ణకార భవనంలో ఆదాయ పన్ను అవగాహన సదస్సు
బంగారు, వెండి వర్తకులకు ఫారం 60/61 పై స్పష్టత
ఇందూరు నగరంలోని స్వర్ణకార భవనంలో బంగారు వెండి వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ఆదాయ పన్ను శాఖ ఆధికారి నీరజ్ కుమార్ ఆదేశానుసారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన మోహిత్ షిప్ పాండే, రమేష్ కుమార్, ఇందూరుకు చెందిన సిఏ అంబ్రిష్ అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా ఫారం 60/61, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సంబంధిత అంశాలపై స్పష్టమైన వివరణలతో పాటు, వ్యాపార లావాదేవీలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.
బంగారు వెండి వర్తకుల సంఘం అధ్యక్షులు పాల్దే పెంటయ్య మాట్లాడుతూ, “స్వర్ణకారులకు, బంగారు వెండి వర్తకులకు ఆదాయ పన్ను నియమాలు, కాగితపత్రాల నిర్వహణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం” అని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో సంఘానికి చెందిన ప్రధాన కార్యదర్శి పశువుల రాజ్ కుమార్, కోశాధికారి చిలుక ప్రకాష్, ఉపాధ్యక్షుడు దేవి దాస్, సంయుక్త కార్యదర్శి దొంతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. బంగారు వెండి వ్యాపారులు పెద్ద సంఖ్యలో హాజరై ఉపయోగకరమైన సమాచారం అందిపుచ్చుకున్నారు.