కోట్లలో ఆదాయం… వసతులు శూన్యం

కోట్లలో ఆదాయం… వసతులు శూన్యం

కోట్లలో ఆదాయం… వసతులు శూన్యం

నింబాచల క్షేత్రంలో భక్తుల ఇబ్బందులు – దాతల సహకారానికి అడ్డుకట్ట వేస్తున్న అర్చకులేనా?

మనోరంజని తెలుగు టైమ్స్ భీమ్‌గల్, ప్రతినిధి నవంబర్ 6,

కోట్లలో ఆదాయం… వసతులు శూన్యం

ప్రతి ఏటా కోట్లలో ఆదాయం వచ్చే నింబాచల క్షేత్రం (లింబాద్రిగుట్ట) భక్తులకు మాత్రం సౌకర్యాల పరంగా శూన్యంగా ఉంది. కార్తీక మాసం సందర్భంగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అయితే, ఆ భక్తులకు తగిన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భక్తులు ప్రాధమిక సౌకర్యాలకే నోచుకోవడం లేదు. శౌచాలయాలు, స్నానాల గదులు, మహిళలకు బట్టలు మార్చుకునే సదుపాయాలు లేకపోవడంతో భక్తులు చెట్లు, పుట్టల వెనుక దాక్కొని పనులు చేసుకోవాల్సి వస్తోంది. క్యూ లైన్‌లో గంటల తరబడి నిలుచోవాల్సి రావడంతో కొందరు మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోట్లలో ఆదాయం… వసతులు శూన్యం

పేరుకే ఎండోమెంట్ – అర్చకుల ఆధిపత్యమే
ఉత్సవాల నిర్వహణ అర్చకుల ఆధ్వర్యంలోనే సాగుతోందని, ఎండోమెంట్ అధికారులు ఉన్నట్టు ఉన్నా వారు నామమాత్రంగానే ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. ఆదాయం, వ్యయం, ఆడిటింగ్ అన్నీ అర్చకులే నియంత్రిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్చకులు చెప్పినట్లుగానే అధికారులు వ్యవహరిస్తున్నారని కూడా వాదనలు వినిపిస్తున్నాయి.

దుర్గంధభరిత క్షేత్రం

కోట్లలో ఆదాయం… వసతులు శూన్యం

బ్రహ్మోత్సవాల సమయంలో క్షేత్రం చుట్టుపక్కల ప్రాంతం దుర్గంధభరితంగా మారిపోతుంది. శౌచాలయాల లేమితో భక్తులు బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడంతో దుర్వాసన వ్యాపిస్తోంది. భక్తులు భక్తి కోసం వస్తే ఇబ్బందులు మాత్రమే ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.దాతలకు అడ్డంకులు
క్షేత్రాభివృద్ధికి అనేక మంది దాతలు ముందుకు రావాలనుకుంటున్నా, అర్చకుల అడ్డంకుల కారణంగా వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. నగదు రూపంలోనే విరాళాలు ఇవ్వాలన్న నిబంధనలు పెట్టి, దాతల సహకారాన్ని దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిర్మించిన వసతులు వాడుకలో లేవు

కోట్లలో ఆదాయం… వసతులు శూన్యం

భక్తుల కోసం కొందరు దాతలు లక్షల రూపాయలు వెచ్చించి గదులు, వసతులు నిర్మించినా, అవి భక్తుల వినియోగానికి అందుబాటులో లేవని తెలుస్తోంది. అర్చకుల నిర్లక్ష్యం, ప్రణాళికా లోపాలతో అవి పనికిరానివిగా మారాయని దాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల డిమాండ్
భక్తుల కోసం దాతలు నిర్మించిన సౌకర్యాలను తక్షణమే అందుబాటులోకి తేవాలని, క్షేత్ర అభివృద్ధి కోసం పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment