- స్వర్ణ గ్రామ ఆశ్రమ పాఠశాలలో నీటి కొరత.
- కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బోర్ వెల్ వేయింపు.
- 350 పీట్లలో నీటి లభ్యత.
- పాఠశాల ఉపాధ్యాయుల ఆనందం.
స్వర్ణ గ్రామ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ నాయకులు ముందుకు వచ్చారు. సోమవారం సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది చేతుల మీదుగా బోర్ వెల్ పనులు ప్రారంభించారు. 350 పీట్ల లోపల నీటి లభ్యత కలిగి పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
సారంగాపూర్, డిసెంబర్ 9:
స్వర్ణ గ్రామ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తాగునీటి కొరత సమస్యతో విద్యార్థులు ఇబ్బంది పడుతుండగా, కాంగ్రెస్ నాయకులు ఈ సమస్యను పరిష్కరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత ఈ సమస్యను కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లిన తరువాత, సోమవారం సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది చేతుల మీదుగా బోర్ వెల్ పనులు ప్రారంభించారు.
350 పీట్ల లోపల నీరు లభించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అట్లా పోతా రెడ్డి, కొత్తకాపు పోతారెడ్డి, బట్టు భోజన్న, అబ్దుల్ ముబీన్, సాక్ పెళ్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాల నీటి సమస్య పరిష్కారం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.