జూబ్లీహిల్స్‌లో మనం భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశం: కేసీఆర్

జూబ్లీహిల్స్‌లో మనం భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశం: కేసీఆర్

జూబ్లీహిల్స్‌లో మనం భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశం: కేసీఆర్

ప్రతి అంశం పార్టీకి అనుకూలంగా ఉందని వ్యాఖ్య

కార్యకర్తలను అప్రమత్తం చేసి ఓటర్లలో అవగాహన కల్పించాలన్న కేసీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్న కేసీఆర్

త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అన్ని నివేదికలు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్‌తో పాటు పలువురు నాయకులతో ఆయన సమావేశమయ్యారు.

జూబ్లీహిల్స్‌‌‌లో ప్రతి అంశం పార్టీకి అనుకూలంగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో కిందిస్థాయి కార్యకర్తలను అప్రమత్తం చేసి, ఓటర్లలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమై ప్రజల విశ్వాసం కోల్పోయిందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని ఆయన సూచించారు

Join WhatsApp

Join Now

Leave a Comment