- శాంతి భద్రతల పరిరక్షణ కోసం జనవరి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు.
- అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు నిషేధం.
- నిషేధిత ఆయుధాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలు కూడా నిషేధం.
- నిబంధనలు ఉల్లంఘించిన వారికి శిక్షార్హత.
నిర్మల్ జిల్లాలో జనవరి 1 నుంచి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే పబ్లిక్ మీటింగ్‌లు, ఊరేగింపులు, నిషేధిత ఆయుధాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలు వాడడం నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నిర్మల్ (ప్రతినిధి):
జనవరి 1 నుంచి 31 వరకు నిర్మల్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయం శాంతి భద్రతలు, ప్రజల మధ్య ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్య అని ఆమె వివరించారు.
30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న కాలంలో, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి లేదా సంబంధిత పోలీస్ ఉన్నత అధికారుల అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగ్‌లు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించకూడదని తెలిపారు.
అదేవిధంగా, నిషేధిత ఆయుధాలు, కత్తులు, చాకులు, కర్రలు, తుపాకులు, ప్రేలుడు పదార్థాలు వంటివి వాడరాదని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా జనసమూహాలు ఏర్పాటు చేయడం, రాళ్లు జమచేయడం, లౌడ్ స్పీకర్లు, డీజేలను వినియోగించడం కూడా నిషేధితమని ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ నిబంధనలు ఉల్లంఘించినవారు 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.