- మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం
- బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు
- అక్టోబర్ 21, 22 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- పలు జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్
తెలంగాణలో వర్షాలు కురుస్తుండగా, మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల అక్టోబర్ 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలెర్ట్ జారీ చేస్తూ, ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించింది.
తెలంగాణలో ప్రజలు వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ (ఇండియన్ మెటిరియలాజికల్ డిపార్ట్మెంట్) హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల అక్టోబర్ 21, 22 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు రాష్ట్రంలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, రంగారెడ్డి, మల్కాజిగిరి తదితర జిల్లాల్లో కురిసే అవకాశముంది.
ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటు 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. దీని ప్రభావంతో యెల్లో అలెర్ట్ జారీ చేయబడింది. అండమాన్ సముద్రంలో ఉన్న మరో అల్పపీడనం ఉత్తర దిశగా పయనించి, అక్టోబర్ 23 లేదా 24వ తేదీల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.