సంక్రాంతికి వస్తున్నాం’ ఏ ఓటీటీ వేదికలో చూడొచ్చంటే…!

సంక్రాంతికి వస్తున్నాం’ ఏ ఓటీటీ వేదికలో చూడొచ్చంటే…!

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం
రికార్డు స్థాయిలో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ రైట్స్ పై అప్ డేట్ ఈ ఏడాది సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టయినర్ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది.

తాజాగా, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం శాటిలైట్, ఓటీటీ హక్కులకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు చానల్ దక్కించుకోగా, ఓటీటీ హక్కులను *జీ5* సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment