నేడు కార్తీక పౌర్ణమి.. ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షమే..

నేడు కార్తీక పౌర్ణమి.. ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షమే..

నేడు కార్తీక పౌర్ణమి.. ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షమే..

హిందూ సంప్రదాయంలో ప్రతి మాసానికీ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి తిథి అత్యంత శుభప్రదమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు శివుడు త్రిపురాసురులను సంహరించిన రోజు కావడంతో దీన్ని త్రిపురారి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు దీపారాధన, వ్రతాలు, దానాలు చేస్తే పాపాలు నశించి, అనేక శుభాలు కలుగుతాయని విశ్వాసం. కార్తీక మాసం శివుడి, విష్ణువు ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది. ఈ మాసం చివరి రోజైన పౌర్ణమి రోజు భక్తులు శివాలయాలకు, విష్ణుమందిరాలకు చేరి పూజలు, దీపారాధన చేస్తారు. ఈ రోజున చేసిన పూజలు, వ్రతాలు సంవత్సరం పొడవునా చేసిన పూజల ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

ఇవాళ(బుధవారం) రోజు రాత్రి 10.30 నుంచి మరుసటి రోజు సాయంత్రం 6.48 వరకు పౌర్ణమి తిథి ప్రభావం ఉంటుంది. తిథి ప్రభావం సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు అధికంగా ఉండటం వలన, వ్రతం ఆచరించడం శ్రేయస్కరం. ఈ పౌర్ణమిని త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు. శివుడు త్రిపురాసురులను సంహరించిన రోజు ఇదే.

కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా 365 వత్తులతో దీపారాధన చేయాలి. ఈ వత్తులు సంవత్సరంలో 365 రోజులకు ప్రతీక. ఈ విధంగా దీపారాధన చేయడం అపారమైన శుభాన్ని ఇస్తుంది. ఈ ఒక్క రోజు దీపారాధన సంవత్సరం పొడుగునా చేసిన దీపారాధన ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా దీపాలు వెలిగిస్తే దోషాలు నివారించవచ్చు. ముఖ్యంగా, శివాలయాలు, విష్ణు దేవాలయాలు రావి చెట్టు వద్ద దీపం పెట్టడం మహా పుణ్యం.

పవిత్ర కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. దీనిని కార్తీక స్నానం అని అంటారు. ఈ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం వేకువ జామున ఉండటం వలన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. సాయంకాలం దీపారాధన చేసేందుకు కూడా శుభ సమయం ఉంది. సాయంత్రం 5.15 నుండి 7.05 వరకు దీపారాధన చేయడానికి మంచి సమయమని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో దీపాలు వెలిగిస్తే ఇంట సిరిసంపదలు చేకూరుతాయి.

పౌర్ణమి రోజున వ్రతం ఆచరించేవారు ఉదయాన్నే నదీ స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. రోజంతా ఉపవాసం ఉండటం ఉత్తమం. ఉదయం సాయంత్రం శివునికి, విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేందుకు కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైనది. వ్రత ఆచరణ భక్తిశ్రద్ధలతో ఉండాలి. దేవాలయాల్లో కార్తీక దీపం వెలిగించి, ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేయాలి. నిరాహారంగా ఉండలేని వారు పాలు, పండ్లు లాంటివి తీసుకోవచ్చు. సాయంత్రం దీపారాధన అయిన తర్వాత ఉపవాసం విరమించాలి.

కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలు దానధర్మాలు అంతులేని ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు చేసే ఏ చిన్న దానం అయినా ఎన్నో రెట్లు పెరిగి తిరిగి వస్తుందని నమ్మకం. దీపారాధన శుభఫలితాలు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి. తిథి ప్రభావం, శుభ ముహూర్తాలు ఆచారాలు ప్రాంతాన్ని బట్టి కొద్దిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆచారాలు పాటించే ముందు స్థానిక దేవాలయాల నుంచి లేదా అనుభవజ్ఞులైన పండితుల నుంచి సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

Join WhatsApp

Join Now

Leave a Comment