తూకంలో తేడా ఉంటే వ్యాపారస్తులపై చర్యలు తప్పవు

తూకంలో తేడా ఉంటే వ్యాపారస్తులపై చర్యలు తప్పవు

తూనికలు- కొలతల శాఖ జోనల్ అధికారి విజయ సారథి

ఎమ్4 ప్రతినిధి ముధోల్

 

వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో భాగంగా వ్యాపారస్తులు తూకంలో తేడాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తూనికలు -కొలతల శాఖ కరీంనగర్ జోనల్ అధికారి విజయ సారథి అన్నారు. గురువారం మండల కేంద్రమైన ముధోల్ లోని కిరాణా దుకాణాలు- స్వీట్ హోమ్ లలో డిజిటల్ తూకాలను పరిశీలించారు. ప్రత్యక్షంగా డిజిటల్ తూకాల్లో బాట్లు వేయగా తేడాలు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ తూకాల్లో తేడాలు గుర్తించి నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు తూకాల్లో మోసానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో భాగంగా సంవత్సర కాలంలో రెండు పర్యాయాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి తూకాల్లో మోసాలు గుర్తించి జరిమాన విధించడంతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వ్యాపారస్తులు సైతం తనవంతు బాధ్యతగా తూకాలను ప్రతి సంవత్సరం నిర్ణీత వ్యవధిలో సరి చూసుకోవాలని పేర్కొన్నారు. తూనికలు -కొలతల అధికారులు వ్యాపార సముదాయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలియడంతో వ్యాపారస్తులు తమ డిజిటల్ తూకాలను దాచుకున్నారు. వ్యాపారస్తులు తూకాలు మోసానికి పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూనికలు -కొలతల శాఖ నిర్మల్ జిల్లా అధికారి భూలక్ష్మి, సిబ్బంది, తదితరులున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment