గ్రామ ప్రగతి కోసం పనిచేస్తా. సర్పంచ్ కునేరు భూమన్న.
మనోరంజని తెలుగు టైమ్స్ – నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మన గ్రామ ప్రగతి కోసం పనిచేస్తా నని మండల కేంద్రం నూతనంగా గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్ కునేరు భూమన్న అన్నారు. ముందుగా అత్యంత మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలు కృతజ్ఞత తెలిపారు.ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు
అందుబాటులో ఉండి గ్రామ ఐక్యతతో పాటు అభివృద్ధి
చేస్తానని వెల్లడించారు.
అంతరం గెలుపొందిన భూమన్న కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.