విఘ్నేశ్వరుని కృప ఉంటే మన ప్రయత్నాలన్నీ పలిస్తాయి : కోట నరేష్
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి ఆగస్టు 28 : విఘ్నేశ్వరుని కృప ఉంటే మనం అనుకున్న ప్రయత్నాలన్ని పలిస్తాయని కాంగ్రెస్ యువ నాయకులు కోట నరేష్ అన్నారు.బుదవారం షాబాద్ మండలం బోడంపహాడ్ గ్రామంలో కోట నర్సిములు నర్సింలు మాజీ సర్పంచ్ జ్ఞాపకర్థం నూతనంగా సొంత ఖర్చులతో నిర్మించిన గణపతి మండపాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని విఘ్నేశ్వరుడుని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. వాడ వాడల వెలిసే గణేష్ మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సంఘం అధ్యక్షురాలు కోట లక్ష్మీ,మాజీ సర్పంచ్ బాలకృష్ణ,షాబాద్ మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోట జగదీశ్వర్,ఇనయత్,రామచంద్రయ్యా,భీమయ్య,ఆనంద్, బందీశ్వర్,శ్రీనివాస్, నరసింహ, శ్రీధర్,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు