ఇక పాకిస్థాన్ ఖేల్ ఖతం.. సంచలన నిర్ణయం దిశగా ప్రధాని మోదీ.. అదే కానీ జరిగితే..!!

ఇక పాకిస్థాన్ ఖేల్ ఖతం.. సంచలన నిర్ణయం దిశగా ప్రధాని మోదీ.. అదే కానీ జరిగితే..!!

ఇక పాకిస్థాన్ ఖేల్ ఖతం.. సంచలన నిర్ణయం దిశగా ప్రధాని మోదీ.. అదే కానీ జరిగితే..!!

జమ్ముకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రమూకలు జరిపిన ఘాతుకానికి దేశం ఉలిక్కి పడింది. పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమానికి అభం శుభం తెలియని 28 మంది పర్యాటకులు మృతి చెందారు.
పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కాల్పుల శబ్దం విన్న భద్రతా బలగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రమూకల కోసం వేట మొదలు పెట్టాయి.

ఈ ఘటనపై ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఈ ఘటనను పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఘటనను అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే పహల్గాం చేరుకున్న భారత హోం మంత్రి అమిత్ షా.. మృతదేహాలకు నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి ఓదార్చారు.

అయితే ఉగ్రమూకలు జరిపిన ఈ దాడిపై ప్రధాని మోదీ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉత్కంఠంగా మారింది. అతి త్వరలోనే ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకుంటారని భద్రతా బలగాలతోపాటు దేశ ప్రజలు భావిస్తున్నారు. గతంలో 2016లో భారత సైనిక స్థావరంపై ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 19 మంది సైనికులు మరణించారు. ఆ ఘటనకు ప్రతీకారంగా ప్రధాని మోదీ పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ ప్రకటించారు.

“ఉరి సర్జికల్ స్ట్రైక్” 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం చేసిన ఒక సైనిక చర్య. ఇది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. 2016 సెప్టెంబర్ లో ఉరిలో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. మళ్లీ అలాంటి సర్జికల్ స్ట్రైక్ కు ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అదే కానీ జరిగితే పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఉగ్రమూకలను ఏరి పారేయవచ్చని కాశ్మీర్ కు చెందిన మాజీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment